Telangaana

Saturday, January 15, 2011

విశాలాంధ్ర ఏర్పాటు నెహ్రూకు ఇష్టమేనా?

విశాలాంధ్ర ఏర్పాటుకు నెహ్రుకు మొదటి నుంచి ఇష్టం లేదు.ఆనాటి (16-10-1953)కర్నూల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష దాగుందని అన్నారు(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 17-10-1953). కానీ పరిపాలన సులవవుతుందన్న ఉద్దేశంతో దానికి ఆయన అంగీకరించాడు. అయితే.. విశాలాంధ్ర ఏర్పాటును మాత్రం చివరి వరకూ ఆయన వ్యతిరేకించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని నెలల ముందు అంటే.. 5-03-1956న నిజామాబాద్‌లో జరిగిన సభలో నెహ్రూ పాల్గొన్నారు. ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొంతన కుదిరితే సరేసరి లేక పొతే కొంత కాలం తరువాత బార్య,భర్తలు విడాకులు తీసున్నట్లు రెండుప్రాంతాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు(డెక్కన్ క్రానికల్ 06-03-1956) దీన్ని బట్టి విశాలాంధ్ర ఏర్పాటు ఎన్ని అపనమ్మకాల పునాదుల మీద ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

"విశాలాంధ్ర ఏర్పాటుపై జవహర్ లాల్ నెహ్రు మనోగతం ఆయన మాటల్లోనే" క్రింది వీడియోలో చూడండి.

2 comments:

  1. please read this and what do you say?

    http://ramyamgakutirana.blogspot.com/2011/01/blog-post_07.html

    ReplyDelete
  2. మరి నెహ్రూ అంత స్పష్టంగా అర్ధం చేసుకుని కూడా ఎందుకు తెలంగాణాను ఆంధ్ర రాజకీయ దళారులకు బలి పశువును చేసాడో?
    ఫజల్ అలీ కమిషన్ ఈ విలీనాన్ని కూలంకషంగా అధ్యయనం చేసింది.
    తెలంగాణాను ఒక ఐదు సంవత్సరాలు ఆగి 1962 జనరల్ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పటి శాసన సభ మెజారిటీ అభిప్రాయం ప్రకారం
    ఆంధ్ర తో విలీనం చేయాలని అంత స్పష్టం గా చెప్పినా ఎందుకు ఆ సిఫారసును బుట్టదాఖలు చేసాడు.
    హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణా రాష్ట్రంగా ఉనికిలోకి రాక ముందే మొగ్గలోనే ఎందుకు తున్చేసారు.

    అప్పటి హైదరాబాద్ రాష్ట్రం శాసన సభలో మహారాష్ట్రలో, కర్ణాటకలో కలిసిన ఏడు జిల్లాల ప్రజా ప్రతినిదులుండే వారు.
    వాళ్ళు తెలంగాణా భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు.
    దానికి విలువేలా వుంటుంది. వాళ్ళ తొందర వాళ్ళది కదా.

    ఈ పాపం ఎవ్వరిది?

    ReplyDelete