Telangaana

Friday, March 11, 2011

ఇది తెలంగాణ లగ్గం సువరాక


ఇది తెలంగాణ ప్రజల మనోగతం, ఇంతకంటే సాక్ష్యం కావాల?

Tuesday, January 18, 2011

ఆన్ లైన్ లో శ్రీకృష్ణ కమిటి తెలుగు నివేదిక

ప్రజల సౌకర్యం కొరకు శ్రీకృష్ణ కమిటి తెలుగు నివేదికలు ఆన్ లైన్ లో ఉంచినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలొ తెలిపింది.ఈ నివేదికలు www.ap.gov.in, www.aponline.gov.in వెబ్ సైట్లలో లబిస్తున్నట్లు తెలిపారు.

నివేదికల డైరెక్టు లింకులు.
http://www.ziddu.com/download/13454886/chapter_1.pdf.html
http://www.ziddu.com/download/13454888/chapter_2.pdf.html
http://www.ziddu.com/download/13454887/chapter_3.pdf.html
http://www.ziddu.com/download/13454882/chapter_4.pdf.html
http://www.ziddu.com/download/13454881/chapter_5.pdf.html
http://www.ziddu.com/download/13454885/chapter_6.pdf.html
http://www.ziddu.com/download/13454883/chapter_7.pdf.html
http://www.ziddu.com/download/13454889/chapter_8.pdf.html
http://www.ziddu.com/download/13454880/chapter_9.pdf.html
http://www.ziddu.com/download/13454884/FinalSKCTelugu.pdf.html

Saturday, January 15, 2011

విశాలాంధ్ర ఏర్పాటు నెహ్రూకు ఇష్టమేనా?

విశాలాంధ్ర ఏర్పాటుకు నెహ్రుకు మొదటి నుంచి ఇష్టం లేదు.ఆనాటి (16-10-1953)కర్నూల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష దాగుందని అన్నారు(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 17-10-1953). కానీ పరిపాలన సులవవుతుందన్న ఉద్దేశంతో దానికి ఆయన అంగీకరించాడు. అయితే.. విశాలాంధ్ర ఏర్పాటును మాత్రం చివరి వరకూ ఆయన వ్యతిరేకించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని నెలల ముందు అంటే.. 5-03-1956న నిజామాబాద్‌లో జరిగిన సభలో నెహ్రూ పాల్గొన్నారు. ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొంతన కుదిరితే సరేసరి లేక పొతే కొంత కాలం తరువాత బార్య,భర్తలు విడాకులు తీసున్నట్లు రెండుప్రాంతాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు(డెక్కన్ క్రానికల్ 06-03-1956) దీన్ని బట్టి విశాలాంధ్ర ఏర్పాటు ఎన్ని అపనమ్మకాల పునాదుల మీద ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

"విశాలాంధ్ర ఏర్పాటుపై జవహర్ లాల్ నెహ్రు మనోగతం ఆయన మాటల్లోనే" క్రింది వీడియోలో చూడండి.

Thursday, January 13, 2011

ఇది తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ తీరు




ఈ చిత్రం చిత్రకారుడు మితృలు అన్నవరం శ్రీనివాస్ కుంచె నుంచి జాలువారింది

అన్నవరం శ్రీనివాస్ వ్యాఖ్య: ఈ చిత్రం శ్రీ కృష్ణ కమిటి 6 సూచనల ఫై వేసింది .మొదటి 4 ఎలా వచ్చాయో ,5 వది బొటన వేలుకున్న పవర్ ,6 వది పనికి రానిది .

Sunday, January 9, 2011

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదా?

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన తరువాత తెలంగాణాలో ఊపందుకుంటున్న ఆందోళనలు సీమాంధ్రకు విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేయలేని దశకు చేరుకుంటే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చు.శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో కనిపిస్తున్న ఆందోళన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో లేదు.తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తప్ప నియోజక వర్గాలలో అడుగుపెట్టలేమని తెలంగాణ ప్రాంత ఎంపీల్లో అత్యధికులు హైకమాండ్‌కు స్పష్టం చేస్తూ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపితే అటూ సీమాంధ్రల్లో సైతం ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది.ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలూ రాజీనామా బాట పడితే ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చూడడానికి మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మరోవిడత చర్చలు జరపాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.ఒక వేళ చర్చలు సఫలం కాక పోతే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చనే వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి చిట్టచివరి అస్త్రంగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే దిశలో కేంద్రం అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Thursday, January 6, 2011

బయట పడిన శ్రీకృష్ణ లీలలు

శ్రీ కృష్ణ కమిటి మొత్తం 6 సూచనలను తన నివేదికలో పొందుపరిచింది అవి .

1. రాష్ట్రాన్ని యథాతథ స్థితి కొనసాగించటం

2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, - హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా చేయటం
రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు

3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర విభజించటం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణ భాగంలోనే ఉంచటం.

4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, హైదరాబాద్ విస్తృత మెట్రో నగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కోసాంధ్ర, రాయలసీమకు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం కొనసాగించటం.

5 రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల పరిధి ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని.

6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయటం